పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

🌸 ముహూర్త విషయంలో తిథ్యాదుల బలాబలాలు

శ్రీరామ    తిథిరేక గుణం ప్రోక్తం వారాదష్టగుణం భవేత్।  నక్షత్రాశ్శతగుణం ప్రోక్తం లగ్నంచ కోటిగుణ్యతే॥ తిథి ఒకగుణమును, వారము 8గుణములను, నక్షత్రం 100 గుణములను, లగ్నం కోటిగుణములు కల్గి ఉండును.    తిథిదోషం హరేద్వారం వారదోషం హరేస్తభః।  స్తభదోషం హరేలగ్నం లగ్నదోషం హరేద్గ్రహః॥  గ్రహణమయుతం దోషం లగ్నకేంద్ర గురుర్భృగౌ॥ తిథిదోషమును వారము, వారదోషమును నక్షత్రం, నక్షత్రదోషమును లగ్నం, లగ్నదోషమును గ్రహసంపత్తి, కౄరగ్రహసంపత్తి దోషమును లగ్నమందుండిన గురుశుక్రులు తొలగించుదురు. గురు శుక్రులు లగ్నమందుండిన సమస్తదోషములు తొలగిపోవును. అన్నివిధాల దోషరహితమైన ముహూర్తం దొరకడం కష్టం. స్వల్పబలం కలిగిన దోషాలను, విశిష్ట బలం కలిగిన గుణాలు పరిహరిస్తాయి. అందువల్ల గుణాలు అధికంగా గల, తక్కువ దోషాలున్న ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 మీ  R Vijay Sharma  పురోహితులు, జ్యోతిష్యులు  9000532563

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి " పిప్పలాద ుడు" త్రేతాయుగంలో ఒక సమయంలో వానలు పడక విపరీతమైన కరువు ఏర్పడింది. ఆ కరువు కాలంలో తన కుమరుడుని పోషించలేకపోయిన కౌశికుడు అనే మహర్షి ఆ పిల్లవాడిని అడవులలో వదిలి వెళ్ళిపోయాడు. తరువాత మహర్షి అయిన  పిప్పలాద ుడు తన గురువు నారద మహర్షిని ధ్యానించి, ప్రార్థించి తాను ఎందువల్ల తన తల్లిదండ్రులకు దూరమైందీ చెప్పవలసిందిగా వేడుకున్నాడు.  ‘‘శనేశ్వరుని క్రూర దృష్టివల్ల నువ్వు నీ తల్లిదండ్రులకు దూరమయ్యావు’’ అని నారద మహర్షి చెప్పాడు. అందుకు ఆగ్రహించిన  పిప్పలాద ుడు ‘శనిగ్రహాన్ని’ గ్రహమండలం నుండి కిందపడే టట్లు చేసాడు. దానిని చూడటానికి దేవతలందరూ అక్కడకు చేరుకుని  పిప్పలాద ుని శాంతించమని విన్నవించుకున్నారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు  పిప్పలాద ునికి ఎదురుగా వచ్చి ‘‘శనివారంనాడు ఎవరు భక్తితో నిన్ను పూజిస్తారో ఇంకా  పిప్పలాద నామాన్ని స్మరిస్తారో అలాంటి వారు ఏడు జన్మల వరకు శనిగ్రహపు బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదు. అలాంటివారు తమ పుత్రులతోను, మనమలతోనూ కలిసి సుఖంగా జీవిస్తారు’’ అంటూ వరం ప్రసాదించాడు. బ్రహ్మ ప్రసాదించిన ఈ వరం మూలంగానూ, ఇతర దేవతల ప్ర...

జ్యోతిషానికి పరిమితులు ఉన్నాయా!? Does Astrology have limitations!?

ఆలోచిస్తే జన్మ జాతక విశ్లేషణలో జ్యోతిషానికి పరిమితులు ఉన్నాయనిపిస్తుంది. కొన్ని విషయాలకు లోబడి చెప్పినప్పుడు మాత్రమే జ్యోతిషాంశాలు ఫలిస్తాయి.   జ్యోతిషం కర్మ సిద్ధాంతం అనేవి ఒకదానికొకటి ఆశ్రయించి ఉంటాయి. జ్యోతిషంలో జాతకభాగం అనేది కర్మ ఫలాన్ని సూచించేది. ఈ కర్మఫలం అనేది ప్రారబ్ద, సంచిత, ఆగామి అని మూడు రకాలు. ప్రారబ్ద కర్మని అనుభవించి తీర వలసిందే. కానీ సంచిత ఆగామి కర్మలు మనం పుట్టిన తర్వాత చేసిన సత్కర్మాచరణ వలన మార్పు చేసుకోవచ్చు.   పూర్వ జన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే।  తచ్ఛాంతిః ఔషధైః దానైః జపహోమ సురార్చనైః॥  ఒక మనిషి పుట్టిన తర్వాత అతని సత్కర్మ చేత పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితాన్ని మార్చుకోవచ్చు అనేది నిజమైతే, జన్మ జాతకంలో ఉన్నది ఉన్నట్టుగా జరగదు, జాతకంలో ఉన్నది మనం పుట్టిన తర్వాత చేసిన కర్మ ద్వారా కొంత మార్చుకోవచ్చు అనేది కూడా నిజమే..! ఉదాహరణగా అల్పాయుష్కుడైన మార్కండేయునికి చిరంజీవిత్వం లభించడం అనేది తీసుకోవచ్చు.  ఆ జాతకుడు పుట్టిన తర్వాత అతడు “చేసిన సత్కర్మ ఆచరణ, దుష్కర్మ, సంకల్పశక్తి, ప్రయత్నం, తపన” అనే వాటిని బట్టి అతను పొందవలసిన జాతక ...

జాతకంలో ఆయుష్షు నిర్ణయించడం ఎలా?

అష్టమ భావం, అష్టమాధిపతి, ఆయుష్యకారకుడు శనైశ్చరుడు వీరి ముగ్గురిని బట్టి జాతకుడి యొక్క ఆయుష్షు నిర్ణయించచవలసి ఉంటుంది. అష్టమ భావం లో ఏదైనా గ్రహం ఉండడం కంటే ఆ ఇల్లు ఖాళీగా ఉండడం మంచిది. ఖాళీగా ఉండి, శుభగ్రహాల చేత వీక్షించబడటం ముఖ్యంగా శని గురుల చేత చూడబడడం వలన ఆ జాతకుడు పూర్ణాయుష్మంతుడు అవుతాడు.  అష్టమ భావంలో రాహు, కేతు, కుజ గ్రహాలు ఉండడం అల్పాయుష్షుని, ప్రమాదాలను సూచిస్తుంది. అష్టమంలో శనైశ్చరుడు ఉండడం ఒక విచిత్రమైన స్థితి. అతను పాపగ్రహం కాబట్టి గండాలను ఇస్తాడు. ఆయుష్య కారకుడు కాబట్టి ఆయుష్షును ఇస్తాడు. అష్టమంలో శని ఉండి దీర్ఘాయుష్షును పొందిన వారూ ఉన్నారు, అల్పాయుష్షుతో మరణించిన వారూ ఉన్నారు.  అష్టమాధిపతి బలవంతుడై, కేంద్రాలలో ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. లగ్నాధిపతి జాతకంలో బలవంతుడిగా ఉండి కేంద్ర కోణాలలో స్థితి పొందడం, అలాగే అష్టమాధిపతి, శనైశ్చరుడూ కూడా బలం కలిగి ఉండడం జాతకుడిని పూర్ణాయుష్మంతుడిని చేస్తుంది.  జాతకంలో గజకేసరి యోగం ఉండడం కూడా దీర్ఘాయుష్షుని సూచిస్తుంది.  చంద్రుడు మరియు బృహస్పతి ఏకాదశ భావంతో సంబంధం కలిగి ఉండడం దీర్ఘాయుష్షును సూచిస్తుంది. లగ్నాధ...

శ్రీఅర్గళా స్తోత్రం

ఓం అస్య శ్రీఅర్గళాస్తోత్రమన్త్రస్య విష్ణురృషిః, అనుష్టుప్ ఛన్దః,శ్రీమహాలక్ష్మీర్దేవతా,శ్రీజగదంబాప్రీతయే సప్తశతీపాఠాఙ్గత్వేన జపే వినియోగః || ఓం నమశ్చణ్డికాయై || మార్కండేయ ఉవాచ ఓం జయన్తీ మఙ్గళా కాళీ భద్రకాళీ కపాలినీ | దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే || 1 || జయ త్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి | జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోఽస్తు తే || 2 || మధుకైటభవిద్రావివిధాతృవరదే నమః | రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 3 || మహిషాసురనిర్ణాశి భక్తానాం సుఖదే నమః | రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 4 || రక్తబీజవధే దేవి చండముండవినాశిని | రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 5 || శుంభస్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని | రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 6 || వన్దితాఙ్ఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని | రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 7 || అచిన్త్యరూపచరితే సర్వశత్రువినాశిని | రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 8 || నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే | రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 9 || స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్...

అపరాజితా స్తోత్రం

॥శ్రీదేవీ భాగవతాంర్గత అపరాజితా స్తోత్రం॥ శ్రీ గురుభ్యో నమః! హరిః ఓం! నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |  నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || 1 || రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః | జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః || 2 || కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః | నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః || 3 || దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై | ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః || 4 || అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః | నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః || 5 || యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 6 || యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 7 || యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 8 || యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 9 || యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 10 || యా దేవీ...

భావం మంచి-చెడు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది?

భావ పరిశీలన జాతకంలో ఏ విషయంలో అయినా ఎలా ఉంటుంది తెలియాలంటే, ఆ విషయాన్ని సూచించు భావం ఎలా ఉంది అనేది పరిశీలించాలి. లగ్నాన్ని బట్టి ద్వాదశ భావములు ఏర్పడుతున్నాయి. ఆ భావముల ద్వారా ఆ వ్యక్తి ఈ జీవితంలో ఎటువంటి బలాబలాలను కలిగి ఉన్నాడో చెప్పవచ్చు.  భావములు అంటే మనం స్థూలంగా సంపదలు అని అర్థం చేసుకోవచ్చు. 1) భావం ఎలా ఉంది? 2) భావాధిపతి ఎక్కడ ఎలా ఉన్నాడు? 3) భావంలో ఏ గ్రహం ఉంది? 4) భావ కారకుడైన గ్రహం ఎలా ఉంది? 5) కావలసిన విషయానికి సంబంధించిన యోగాలు దోషాలు ఉన్నాయా? అనే విషయాలు బాగా పరిగణించాలి... R విజయ్ శర్మ  9000532563 భావ వృద్ధి ఏ భావానికైనా భావాధిపతి స్వక్షేత్రం ఉత్సాహం మిత్ర క్షేత్రాలలో ఉంటూ ఆ భావాన్ని గాని భావ అధిపతిని గాని శుభగ్రహాలు చూస్తూ ఉంటే భావం గురించి పొందుతుంది- లేదా భావాధిపతి నై.శుభ గ్రహాలతో యుతి పొంది ఉంటే ఆ భావం వకద్ధిపొందుతుంది. జాతకులకు జీవితంలో ఆభావ సంబంధమైన శుభ ఫలితాలు అనుభంలోకి వస్తాయి.    భావం బలహీనం ఏ భావానికైనా ఆ భావం యొక్క అధిపతి నీచ, శత్రు క్షేత్రాలలో ఉంటూ- ఆ భావాన్నీ భావాధిపతినీ నైసర్గిక పాప గ్రహాలు చూస్తూ ఉంటే- లేదా భావాధిపతి నై.పాప గ్రహాలతో యుతి...

🌸జ్యోతిషశాస్త్రము తప్పుటకు 5 కారణములు🌸

చాలామంది జ్యోతిష్యులు నేను చెప్తే ప్రతిదీ నిజమవుతుంది అంటారు. కానీ అది సత్య దూరం. చెప్పిన ప్రతిదీ జరిగిపోదు, కొన్ని తప్పిపోతూ ఉంటాయి. అలా తిప్పడానికి కొన్నికారణాలు ఇలా చెప్పారు  శ్లో॥ అనేక వక్రోద్భవ భిన్నభావైః| పంచాంగభేదైశ్చ, కలినా చ కించిత్। అనిచ్ఛతా గర్భగతేన వక్తుం అనుల్బణం జాతక భాగమజ్జెః||  జ్యోతిష శాస్త్రమందలి జాతక ఫలితముల తప్పగుటకు 5 కారణములున్నవి. 1-పూర్వ ఋషులలో అభిప్రాయ భేదములు 2. పంచాంగ భేదములు (ఉదాహరణ: - కె.పి.అయనాంశ బి.వి.రామన్ అయనాంశలకు 1 డిగ్రీ 20ని||ల తేడా ఉన్నది. దీనివలన జన్మకాలదశాశేషము తేడావచ్చును). 3. కలికాల మహిమ 4. శాస్త్ర రహస్యములను శిష్యులకు, గురువులు పూర్తిగా చెప్పకపోవుట. 5. శాస్త్ర పాండిత్యము పూర్తిగా తెలియనివారు జ్యోతిషము చెప్పుట ఈ ఐదు జాతక ఫల వైఫల్యమునకు హేతువులగుచున్నవి. వీరికి జాతకఫలము చెప్పరాదు  శ్లో॥ నోదీరయే దుక్తమపివృధాతత్ విశ్వాసహీనాయచ నాస్తికాయ।  అనర్థదాయావినయాయ నిత్యం కుశంకినే వా బహుగర్హ్యవాచే|| తా॥ నమ్మకము లేనివారికి, దేవుడు లేడను నాస్తికులకు - డబ్బు ఇవ్వనివారికి వినయము లేనివారికి - అన్నింటినీ సందేహించు వారికి - అతిగా మాట్లాడువానికి - ...

🌺 శీఘ్రంగా వివాహం జరగడం కోసం జప మంత్రములు

శ్రీరామ జయం  శీఘ్రంగా వివాహం జరగడం కోసం పురుషుడు స్త్రీలు చేయగల మంత్రాలు ఇవి. ఏ గ్రహం వలన దోషము ఉంటే ఎటువంటి మంత్రం చదువుకోవచ్చు బ్రాకెట్లో సూచించడం జరిగింది.  సాధారణంగా జాతకంలో సప్తమాధిపతి ఎవరో చూసుకొని ఆధిపత్య గ్రహానికి ఇక్కడ సూచించబడిన మంత్రాన్ని జపం చేసుకోవడం ఉత్తమం.   ఏ జప మంత్రమైనా 40 రోజులలో, లక్ష సంఖ్య పూర్తి చేసినట్లయితే ఉత్తమోత్తమం. కనీసం రోజుకు 1000 చొప్పున 40 రోజులు చేయడం మధ్యమము.  జపం చేసే సమయంలో బ్రహ్మచర్యము, భూశయనం, పురాణ శ్రవణం, దేవాలయ ప్రదక్షిణం చేస్తూ చేయాలి. 🌺 వివాహ ప్రద ఇంద్రాణీ మంత్రం(సూర్య, శుక్ర గ్రహ ప్రీతికరం)  ॐ देवेन्द्राणि नमस्तुभ्यं देवेन्द्रप्रिय भामिनि । विवाहं भाग्यमारोग्यं शीघ्रलाभं च देहि मे ॥ దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భామినీ। వివాహం భాగ్య మారోగ్యం శీఘ్ర లాభంచ దేహిమే॥ 🌺 వివాహ ప్రద గౌరీ శంకర మంత్రం (చంద్ర గ్రహ ప్రీతికరం) हे गौरी शंकरार्धांगि । यथा त्वं शंकरप्रिया ।| तथा माँ कुरु कल्याणि । कान्त कांता सुदुर्लभाम्।। హే గౌరీ శంకరార్ధాంగీ । యథా త్వం శంకరప్రియా । తథా మాం కురు కళ్యాణీ  కాంతా కాంతా సుదుర్లభమ్॥ 🌺 ...

Sri Rama Jayam

 Sri Rama Jayam