భావం మంచి-చెడు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది?

భావ పరిశీలన

జాతకంలో ఏ విషయంలో అయినా ఎలా ఉంటుంది తెలియాలంటే, ఆ విషయాన్ని సూచించు భావం ఎలా ఉంది అనేది పరిశీలించాలి.

లగ్నాన్ని బట్టి ద్వాదశ భావములు ఏర్పడుతున్నాయి. ఆ భావముల ద్వారా ఆ వ్యక్తి ఈ జీవితంలో ఎటువంటి బలాబలాలను కలిగి ఉన్నాడో చెప్పవచ్చు. 

భావములు అంటే మనం స్థూలంగా సంపదలు అని అర్థం చేసుకోవచ్చు.

1) భావం ఎలా ఉంది?
2) భావాధిపతి ఎక్కడ ఎలా ఉన్నాడు?
3) భావంలో ఏ గ్రహం ఉంది?
4) భావ కారకుడైన గ్రహం ఎలా ఉంది?
5) కావలసిన విషయానికి సంబంధించిన యోగాలు దోషాలు ఉన్నాయా?
అనే విషయాలు బాగా పరిగణించాలి...

R విజయ్ శర్మ 
9000532563

భావ వృద్ధి
ఏ భావానికైనా భావాధిపతి స్వక్షేత్రం ఉత్సాహం మిత్ర క్షేత్రాలలో ఉంటూ ఆ భావాన్ని గాని భావ అధిపతిని గాని శుభగ్రహాలు చూస్తూ ఉంటే భావం గురించి పొందుతుంది- లేదా భావాధిపతి నై.శుభ గ్రహాలతో యుతి పొంది ఉంటే ఆ భావం వకద్ధిపొందుతుంది. జాతకులకు జీవితంలో ఆభావ సంబంధమైన శుభ ఫలితాలు అనుభంలోకి వస్తాయి. 

 భావం బలహీనం
ఏ భావానికైనా ఆ భావం యొక్క అధిపతి నీచ, శత్రు క్షేత్రాలలో ఉంటూ- ఆ భావాన్నీ భావాధిపతినీ నైసర్గిక పాప గ్రహాలు చూస్తూ ఉంటే- లేదా భావాధిపతి నై.పాప గ్రహాలతో యుతి పొంది ఉంటే ఆ భావం పాడవుతుంది. జాతకులకు జీవితంలో చెడుఫలితాలు కలుగుతాయి. 

మీ 
R విజయ్ శర్మ 
పురోహితులు, జ్యోతిష్యులు
9000532563

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

🌺 యామము అంటే..

నరక చతుర్దశి కార్యాకార్యములు

ఇంజనీరింగ్ లేక లా చదువు - జాతకం ప్రకారం ఏది?