నరక చతుర్దశి కార్యాకార్యములు
దీపావళి అనగా ఐదు రోజుల కార్యము.
ధన త్రయోదశి (ధన్వంతరి పూజ లక్ష్మీపూజ)
నరక చతుర్దశి (ఉదయం స్నానం, యమతర్పణం, సాయంత్రం ఉల్కాజ్యలనం)
దీపావళి అమావాస్య ( లక్ష్మీ పూజ, ఉల్కాదానం)
బలిపాడ్యమి (గోవర్ధన పూజ)
యమ విదియ (భగినీ హస్త భోజనం)
నరక చతుర్దశి నాడు సూర్యోదయాన్ని కంటే ముందుగా స్థానాన్ని చేయాలి. ఈ స్నానానికి ముఖ్యమైన సమయం చంద్రోదయ కాలము అంటారు. ఈ నెలలో చంద్రోదయం తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 మధ్యలో ఉంటుంది. ఈ సమయానికి ఏ రోజున చతుర్దశి వ్యాప్తి ఉంటుందో ఆరోజు నరక చతుర్దశి స్నానము చేయాలి.
ఒంటికి నూనె రాసుకుని నలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి. ఆసమయంలో ఉత్తరేణి , సొరకాయ లేదా ఆముదపు కొమ్మని తీసుకుని తల చుట్టూ మూడుసార్లు తిప్పి వేసి అప్పుడు స్నానాన్ని ఆచరించాలి.
తరువాత యమతర్పణము చేయాలి. తల్లిదండ్రులు ఉన్నవారు స్వయంగా దేవ తీర్థముతో లేనివారు అపసవ్యంగా పితృ తీర్థముగా ఈ తరఫున చేస్తారు.
సర్వభూతక్షయాయ నమః, ఔదుంబరాయ నమః, దధ్యాయనమః, నీలాయనమః, పరమేష్ఠినే నమః, వృకోదరాయ నమః, చిత్రాయనమః, చిత్ర
గుప్తాయ నమః” అనియుచ్చరింపుచు నట్లు తర్పణమీయవలెను.
శ్లో॥" తతః ప్రదోషసమయే దీపాన్ దద్యాన్మనోరమాన్,
దేవాలయే మఠే వాపి ప్రాకారోద్యాన వీధిషు, గోవాజిహస్తి శాలాయా మేవం ఘస్రత్రయేపిచ. తులాసంస్థే సహస్రాంశౌ ప్రదోషే భూతదర్శయోః
ఉల్కాహస్తానరాః కుర్యః పితౄణాం మార్గదర్శనం"
అనగాఁ జతుర్దశిమొదలు మూడు
దినముల పర్యంతము ప్రదోషమున మనోహరమైనదీపములను దేవాలయమందు
మఠములందును, ప్రాకారములందు వీధులందును, గోశాల హస్తిశాల గుఱ్ఱపుశాల
మొదలగు వానియందు మంచవలెను.
కొమ్మని తిప్పుటకు మంత్రం
శీతలోష్ణ సమాయుక్త సంకటక దశాన్విత। హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః॥
అని తల చుట్టూ మూడుసార్లు ఆ కొమ్మని తిప్పి పడవేసి స్నానం చేయాలి.
సూర్యుడు మేషమందుండగా జతుర్దశియందు దర్శయందును ప్రదోషమున నుల్కలనగా కౌరవులు ధరించి నరులు మహాలయము వచ్చిన
పితృదేవతలకు మార్గము జూపించవలెను.
అపుడు మంత్రము.
యే జీవాయే ప్యదగ్ధాః కులేమమ, ఉజ్జ్వలజ్యోతిషా దగ్ధాస్తే యాంతు పరమాం గతిం.
యమలోకం పరిత్యజ్య ఆగతా యే మహాలయే, ఉజ్జ్వలజ్యోతిషా వర్త ప్రపశ్యంతు ప్రజంతుతే.” అని
అగ్నిలో దహించబడిన దహించనటువంటి అన్ని జీవులు నా చేత వెలిగించబడే ఈ జ్యోతుల వెలుగు వలన ఉత్తమ గదులు పొందాలి. మహాలయమునందు యమలోకాన్ని వదిలి వచ్చిన పితృదేవతలు, ఈరోజు పితృలోకాన్ని పొందుటకు వెళ్లుచున్నారు. వారికి ఈ జ్యోతులు మార్గాన్ని చూపించాలి.
ఈ చతుర్దశియందు నక్త భోజనము
మహాఫలదము. ఇక నాశ్వినామావాస్యయందు భ్రాతఃకాలమున సభ్యంగము ప్రదోషమున దీపదానము లక్ష్మీపూజయు మొదలగునది విహితము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి