🌸జ్యోతిషశాస్త్రము తప్పుటకు 5 కారణములు🌸
చాలామంది జ్యోతిష్యులు నేను చెప్తే ప్రతిదీ నిజమవుతుంది అంటారు. కానీ అది సత్య దూరం. చెప్పిన ప్రతిదీ జరిగిపోదు, కొన్ని తప్పిపోతూ ఉంటాయి. అలా తిప్పడానికి కొన్నికారణాలు ఇలా చెప్పారు
శ్లో॥ అనేక వక్రోద్భవ భిన్నభావైః| పంచాంగభేదైశ్చ, కలినా చ కించిత్।
అనిచ్ఛతా గర్భగతేన వక్తుం అనుల్బణం జాతక భాగమజ్జెః||
జ్యోతిష శాస్త్రమందలి జాతక ఫలితముల తప్పగుటకు 5 కారణములున్నవి. 1-పూర్వ ఋషులలో అభిప్రాయ భేదములు 2. పంచాంగ భేదములు (ఉదాహరణ: - కె.పి.అయనాంశ బి.వి.రామన్ అయనాంశలకు 1 డిగ్రీ 20ని||ల తేడా ఉన్నది. దీనివలన జన్మకాలదశాశేషము తేడావచ్చును). 3. కలికాల మహిమ 4. శాస్త్ర రహస్యములను శిష్యులకు, గురువులు పూర్తిగా చెప్పకపోవుట. 5. శాస్త్ర పాండిత్యము పూర్తిగా తెలియనివారు జ్యోతిషము చెప్పుట ఈ ఐదు జాతక ఫల వైఫల్యమునకు హేతువులగుచున్నవి.
వీరికి జాతకఫలము చెప్పరాదు
శ్లో॥ నోదీరయే దుక్తమపివృధాతత్ విశ్వాసహీనాయచ నాస్తికాయ।
అనర్థదాయావినయాయ నిత్యం కుశంకినే వా బహుగర్హ్యవాచే||
తా॥ నమ్మకము లేనివారికి, దేవుడు లేడను నాస్తికులకు - డబ్బు ఇవ్వనివారికి వినయము లేనివారికి - అన్నింటినీ సందేహించు వారికి - అతిగా మాట్లాడువానికి - జాతకము చెప్పరాదు. చెప్పినచో ఫలించదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి