దీపావళి అనగా ఐదు రోజుల కార్యము. ధన త్రయోదశి (ధన్వంతరి పూజ లక్ష్మీపూజ) నరక చతుర్దశి (ఉదయం స్నానం, యమతర్పణం, సాయంత్రం ఉల్కాజ్యలనం) దీపావళి అమావాస్య ( లక్ష్మీ పూజ, ఉల్కాదానం) బలిపాడ్యమి (గోవర్ధన పూజ) యమ విదియ (భగినీ హస్త భోజనం) నరక చతుర్దశి నాడు సూర్యోదయాన్ని కంటే ముందుగా స్థానాన్ని చేయాలి. ఈ స్నానానికి ముఖ్యమైన సమయం చంద్రోదయ కాలము అంటారు. ఈ నెలలో చంద్రోదయం తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 మధ్యలో ఉంటుంది. ఈ సమయానికి ఏ రోజున చతుర్దశి వ్యాప్తి ఉంటుందో ఆరోజు నరక చతుర్దశి స్నానము చేయాలి. ఒంటికి నూనె రాసుకుని నలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి. ఆసమయంలో ఉత్తరేణి , సొరకాయ లేదా ఆముదపు కొమ్మని తీసుకుని తల చుట్టూ మూడుసార్లు తిప్పి వేసి అప్పుడు స్నానాన్ని ఆచరించాలి. తరువాత యమతర్పణము చేయాలి. తల్లిదండ్రులు ఉన్నవారు స్వయంగా దేవ తీర్థముతో లేనివారు అపసవ్యంగా పితృ తీర్థముగా ఈ తరఫున చేస్తారు. సర్వభూతక్షయాయ నమః, ఔదుంబరాయ నమః, దధ్యాయ నమః, నీలాయనమః, పరమేష్ఠినే నమః, వృకోదరాయ నమః, చిత్రాయనమః, చిత్ర గుప్తాయ నమః” అనియుచ్చరింపుచు నట్లు తర్పణమీయవలెను. శ్లో॥" తతః ప్...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి