నీచ భంగ రాజయోగం అంటే ఏమిటి?

నీచభంగరాజయోగములు - ఫలదీపిక

శ్లో॥ నీచస్థితో జర్మని యోగ్రహ న్యా త్తద్రాసి నాథోపి త దుచ్చనా ధ న చంద్రలగ్నాద్యదీ కేంద్రవ ర్తీ రాజు భవే ధార్మిక చక్రవర్తీ |

. భావం ఏదేవి గ్రహము నీచయందుండ ఆ నీచగ్రహరాశినాథుడుగానీ, తదుచ్ఛరాశి నాథుడుగానీ చంద్రునకుగానీ, లగ్నమునకుగానీ కేంద్రమయియున్న అట్టిజాతకుడు రాజు అగును.

సూచన - ఇచ్చట లగ్నము - చంద్రునకు అవియున్నదికదా, కేవలము చంద్ర లగ్నమునకే అన్వయించవలయుననీ యొక వాదముకలదు.

యద్యేకో నీచగతస్త ద్రాస్యధిప సదుచ్ఛ పకేంద్ర యస్యసతు చక్రవర్తీ సమస్తభూపాల వంద్యాంఫ్రీః 1 27 
భావం - నీచపొందిన గ్రహముయొక్క ఉచ్ఛరాశ్యాధిపతి, మరియూ నీచ రాశ్యాధిపతియీ పరస్పర కేంద్రములయందుండ సమస్తభూపాలకవందనములు కలి గిన పాదారవిందుడగు చక్రవర్తియగును

శ్లో యస్మినాశౌ వర్తతే ఖేచర స్త ద్రాళ్ శేన ప్రేక్షిత శ్చేత్సఖేట క్షోణీపాలం కీ ర్తి మంతం విదధ్యాత్ సుస్థాన శ్చేత్కింపున పార్ధివేంద్ర

m

భావం - నీచ గ్రహమును తద్రాశ్యాధిపతి చూచుచున్న రాజగును పైయోగ మున ఆ నీచరాశి లగ్నాత్తు శుభరాశియైన రాజగుటకు సందేహ మేమున్నది శ్లో నీ చేతిష్ఠతి యస్తదాశ్రిత గృహాధీశో విలగ్నాద్యదా చంద్రాద్వాయది నీచగన్య విహగస్వోచ్ఛ నాతో ఒధవా కేంద్రేష్ఠతి చేత్ప్రపూర్ణ విభవః స్యాచ్చక్రవర్తీ నృపో ధర్మిష్ఠాఒన్య మహీశవందిత పద "స్తేజోయశో భాగ్యవాన్ 129 భావం - వీచగ్రహరాశినాధ్.డు, తద్గ్రహ ఉచ్చనాథుడు లగ్నము"గానీ, చం ద్రునకుగానీ కేంద్రములయందున్న అపార ధనవంతుడూ, శక్తివంతుడూ, ఆన్య రాజన్యుల కీర్తినందుకొను పార్థివేంద్రుడు అగును

శ్లో॥ నీచేయ స్తన్య నీచోచ్ఛ ఛేశౌ ద్వావేక ఏవవా 'కేంద్రస్థీశ్చేచ్ఛక్రవర్తి భూప స్యాద్ భూపవందిత 30 భావం - నీచగ్రహరాశినాథుడు - తర్గ్రహ ఉచ్ఛరాశినాథుడు యీ యిద్దరిలో వకరైనా కేంద్రమి నయున్న, పరరాజులచేత నమస్కరింపబడురాజన్యుడు అగును

ఇతి మంత్రేశ్వర విరచితాయాం ఫలదీపికాయాం మహారాజ యోగోనామ సప్తమోఒధ్యాయః

🌺 సమన్వయము
సాధారణంగా జాతకంలో ఏదైనా గ్రహం తన నీచరాశిలో స్థితి పొంది ఉంటే అది తాను ఇవ్వవలసిన ఫలితాలను బలంగా స్పష్టంగా ఇవ్వలేదు. అంటే ఆగ్రహం బలహీన పడింది అని అర్థం. 

కానీ ఒక గ్రహం తన యొక్క నీచరాశిలో ఉన్నప్పటికీ, కొన్ని రకాల గ్రహయోగములు కలిగినప్పుడు, నీచ రాశీ స్థిత దోషం తొలగిపోయి శుభ ఫలితాలనే ఇస్తాడు. దీనినే  నీచభంగ రాజయోగం అంటారు.
 
నీచ భంగ రాజ యోగము ఈక్రింది సందర్భాలలో కలుగుతుంది.

నీచలో ఉన్న గ్రహం 

1. ఉచ్చలో ఉన్న గ్రహం యొక్క రాశిలో ఉన్నా,
2. ఉచ్చలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నా,
3. నవాంశలో ఉచ్చలో ఉన్నా,
4. ఏ రాశిలో నీచ పొందిందో ఆ రాశి యొక్క అధిపతి జన్మలగ్నం లేదా చంద్రలగ్నము లగాయత్తు కేంద్రాల్లో ఉన్నా,
5. ఆ గ్రహానికి ఏ రాశి ఉచ్చ  స్థానముమో ఆ రాశి అధిపతి జన్మలగ్నం లేదా చంద్రలగ్నము లగాయత్తు కేంద్రాల్లో ఉన్నా,
6. గ్రహము ఏ రాశిలో నీచయందున్నచో  ఆ రాశి యొక్క అధిపతి కేంద్రాలలో ఉన్ననూ లేదా ఉచ్చయందున్ననూ నీచ పోయి నీచభంగరాజయోగము ఇచ్చును.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

🌺 యామము అంటే..

నరక చతుర్దశి కార్యాకార్యములు

ఇంజనీరింగ్ లేక లా చదువు - జాతకం ప్రకారం ఏది?