జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగం
🙏 శ్రీరామ జయం🙏
🌸 *జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగం*
ఎవరి జాతకం నాయన ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేదా తెలుసుకోవాలి అంటే వాళ్ల జాతకంలో దశమాధిపతిని పరిశీలించాలి.
🌸 *భావాలు*
👉10వ భావం ఉద్యోగ పదవిని తెలియజేస్తుంది
👉6వ భావం వాళ్లు శ్రమ చేసే, సర్వీస్ అందించే విధానాన్ని తెలియజేస్తుంది.
👉9వ భావం ప్రభుత్వాన్ని సూచిస్తుంది. నిజానికి 9 అనేది 10 కి వ్యయం కానీ, ప్రభుత్వ ఉద్యోగానికి తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చే ఉద్యోగానికి ఇది శుభదాయకం.
👉2 ఆదాయాన్ని 11 లాభాన్ని సూచిస్తాయి.
R Vijay Sharma 9000532563
🌸 *గ్రహాలు*
ప్రభుత్వ ఉద్యోగానికి *రవి, గురు, కుజ, శనులు* ప్రధానం.
👉 *సూర్యుడు* గొప్ప అధికారం గల ప్రభుత్వ పదవికి ముఖ్య గ్రహం
👉 *గురుడు* టీచర్ మరియు I.A.S. ఉద్యోగానికి, సెక్రటేరియట్, Govt Banks, యూనివర్సిటీ వంటి వాటిలో గొప్ప చదువు వలన వచ్చే ఉద్యోగానికి ముఖ్య గ్రహం.
👉 *కుజుడు* పోలీస్, ఆర్మీ, నేవీ వంటి వాటిలో ఉద్యోగాన్ని సూచిస్తాడు. ప్రభుత్వ రంగ కర్మాగారాలలో, రైల్వే, RTC, electricity వంటి విభాగాల్లో పనిచేయడాన్ని సూచిస్తాడు.
👉 *శనైశ్చరుడు* ప్రభుత్వ రంగంలో క్రమశిక్షణ శ్రామిక వర్గం చిన్న స్థాయి ఉద్యోగాలని సూచించే గ్రహం.
R Vijay Sharma 9000532563
🌸 *రాశులు*
మేష, సింహ, ధనుర్, మకర రాశులు సహజంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సూచిస్తాయి.
R Vijay Sharma 9000532563
🌸 *కొన్ని యోగాలు*
👉10వ భావానికి *రవి* అధిపతి అవ్వాలి లేదా 10, 6 భావాలలో స్థితి పొంది ఉండాలి. రవి స్వ, ఉచ్చ, మిత్ర క్షేత్రాల్లో ఉండాలి. గెజిటెడ్ ఉద్యోగం వస్తుంది.
👉 10వ భావానికి *గురుడు* అధిపతి అవ్వాలి లేదా 10,6, 9 భావాలలో స్థితి పొంది ఉండాలి. ఆ గురుడు స్వ, ఉచ్చ, మిత్ర క్షేత్రాల్లో ఉండాలి. 9వ భావంతో కనెక్షన్ కూడా వస్తే టీచర్ ఉద్యోగం తప్పక వస్తుంది.
ఇలాగే గురు శనులకు కూడా చూడాలి.
మీ
R Vijay Sharma 9000532563
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి