పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

🌺 అశౌచ సమయే వివాహ విషయః

నిశ్చితార్థం అయిన తర్వాత తల్లిదండ్రుల మరణం సంభవిస్తే వివాహం చేయవచ్చా? సంవత్సర సూతకంలో వివాహం చేయవచ్చా? ఎప్పుడు చేయాలి? ॥శ్లో॥ పితుర్మాతుశ్చ పత్న్యాశ్చ వర్షమర్ధంతదర్ధకమ్। సుతభ్రాత్రోస్సార్ధ మాసమన్యేషామ్మాససమ్మితమ్।।  తదన్తే శాన్తింకృత్వా యథోక్తవిధినాతతః। పునశ్చైవాథవాగ్దానం కృత్వాలగ్నం విధీయతే।। వివాహమునకు నిశ్చితార్థం అయిన తర్వాత తండ్రి మృతినొందిన ఎడల సంవత్సరము, తల్లి మృతికి ఆరుమాసములు, భార్య మృతికి మూడు మాసములు, కుమారుడు-సోదరుడు మృతినొందిన 45 దినములు ఆగి తరువాత *వినాయకశాంతి* చేసి తిరిగి వాగ్దానము-నిశ్చితార్థము చేసి, సుముహూర్తము నిశ్చయించి, వివాహము చేయవలెను. శ్లో॥ అన్యేషాం సపిండానాం మాసమేకముదాహృతమ్। ఉక్తకాలావధిర్యావత్తావన్నైవ శుభక్రియా॥  సపిండులకు ఒక మాసం అసౌచము ఉంటుంది. పై విధంగా మాతాపిత్రాదులు మృతినొందినప్పుడు, పుత్రాదులకు పైన చెప్పబడినంతకాలము అశౌచము ఉంటుంది, కాబట్టి అంతకాలము శుభ కర్మలు  చేయకూడదు.  👉 ఇందులకు అపవాదు మాతా పితౄణాం ప్రథమాబ్దమధ్యే యద్యుత్సవ స్సోపి శుభం నకుర్యాత్।  ఊనం నకుర్యాద్యదివా విమోకం నైవాబ్దికం యావదధోశుభంచేత్॥  వివాహాది ప్రకుర్వీత యదా మహ...

🌺 గృహం లో వాస్తు వేధ దోషాలు తెలుసుకొనుట ఎలా...!!

వేధలు అంటే కనిపించకుండా బాధించే వాస్తు దోషాలు. వేధల్లో కొన్ని సహజమైన ప్రకృతి సంబంధమైనవి. మరికొన్ని సామాజిక మైనవి. కుడ్య వేధ: ఇల్లు కడుతూ ఉన్నప్పుడు తూర్పు ఉత్తరం ప్రహరీ గోడలు కాని ఇతరమైన గోడలు కాని పడమర, దక్షిణ దిశలకన్నా ఎత్తుగా ఉండకూడదు. అంటే పడమర దక్షిణ దిశల గోడలు ఎత్తుగా ఉండాలి. తారతమ్య వేధ : ఇంట్లో ఎప్పుడూ దక్షిణ పడమరల వైపు పెద్దవారు నివసించాలి. తూర్పు ఉత్తరముల వైపు చిన్నవారు వుండాలి. అలా కాకుండా వ్యత్యస్తంగా అయినప్పుడు తారతమ్య వేధా దోషం కలుగుతుంది. నత వేధ : ఇంటి ఆవరణలో తూర్పు ఉత్తర భాగములు ఎత్తుగాను, పశ్చిమ దక్షిణములు పల్లముగాను ఉండుట వలన నత వేధా దోషం కలుగుతుంది. దాని వలన చోర బాధలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవిస్తాయి. కాంతి హీన వేధ : ఇంటిలోకి మొదటి, నాలుగు జాములో సూర్యరశ్మి సోకాలి. లేకపోతే కాంతి హీన వేధ దోషం కారణంగా భూత బాధలు పీడిస్తాయి. క్షౌద్ర వేధ: ఇంట్లో ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ దిశల్లో పుట్టలు (చీమల పుట్టలు-పాముపుట్టలు) అదేపనిగా తేనె పట్టులు పెడుతూ ఉండడం మంచిది కాదు. అలా జరిగిన సందర్భాలలో కొన్ని నిర్మాణాలు అకస్మాత్తుగా భూమిలో కృంగిపోయిన సందర్భాలున్నాయి. దానినే క్షౌద్ర వేధ అంటారు. పశ...

🌺 అముక్తాభరణ సంతాన సప్తమీ వ్రతం

సంతాన ప్రాప్తికి, సంతాన క్షేమం కొరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి. దీనిని ఆచరించేవారు, పగలంతా ఉపవసించి, సాయంత్రం గౌరీపరమేశ్వరులను గంధము, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో ఆరాధించాలి. ఆవుపాలు, బెల్లముతో వండిన పిండివంటలు నైవేద్యముగా పెట్టి తాంబూలమును కూడా సమర్పించాలి. పూజా సమయంలో ఒక ఎర్రని రంగులోనున్న తోరమును దేవుని వద్ద నుంచి పూజించి , వ్రతము పూర్తయ్యాక దానిని తీసి ధరించాలి.

🌺 సోమవారం అమావాస్య

సోమవారం + అమావాస్య కలిసే రోజున ఆడవారు సౌభాగ్యం కోసం " అమాసోమవార వ్రతం"   చేసుకుంటారు.   ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘ సోమవతీ అమావాస్య ’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమవారం రోజున తెల్లవారు ఝామున లేచి దేవాలయలంలో రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి దీపారధన చేసి. చెట్టు మూలాన్నినిళ్ళతో తడిపి పద్మం ముగ్గు పెట్టి , చెట్టుకి గంధం కలిపిన నీలు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి.   క్రింది   (మూలతో బ్రహ్మ... అనే )  శ్లోకం చదువు కుంటూ ప్రదక్షిణ చేయాలి. నిత్య సౌభాగ్యవతిగ దీవించమని వేడుకోవాలి. తరువాత ముతయిదువులకి పండు తాంబూలం ఇవ్వాలి. 🥀 వ్రత కథ 🥀 అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.ఆ కూతురి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని, ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు. అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రిందనిలబడి, “సము...

🌺 యామము అంటే..

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలాన్ని " దినము లేక పగలు " అని అంటారు. తిరిగి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని " రాత్రి " అంటారు.  ఈ పగలు రాత్రి రెండిటినీ కలిపి " అహోరాత్రము " అని పిలుస్తారు.  పగటిని 4 భాగాలుగాను, రాత్రిని 4 భాగాలుగాను చేస్తే దానికే " యామము " అని పేరు. యామమునకు " ప్రహార, జాము " అని కూడా పేర్లు ఉంటాయి.  (రాత్రి రెండవ ఝాములో, మూడవ ఝాములో అంటాముకదా..!) ఒక రోజులో సరిగ్గా 24 గంటలే ఉంటే, ఒక యామమునకు 3 గంటల సమయం గా తీసుకోవచ్చు.  కానీ వేద కాలమానం ప్రకారము, ఒక రోజుకు సరిగ్గా 24 గంటలు ఉండదు దానిలో మార్పులు ఉంటాయి.  సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో తేడాలు ఉండడం వలన ఈ రాత్రి పగలు లేదా ఒక అహురాత్రం లేదా ఒక యామము యొక్క కాలమానం కూడా మారుతుంది. మీ R విజయ్ శర్మ  పురోహితులు, జ్యోతిష్యులు 9000532563