పోస్ట్‌లు

జనవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

రథసప్తమి విశిష్టత

ఈ క్రింది శ్లోకాలు రథసప్తమి స్నాన ప్రాశస్త్యాన్ని మరియు ఆ సమయంలో కోరుకోవాల్సిన ఫలాలను వివరిస్తున్నాయి. వీటి అర్థం సరళమైన తెలుగులో ఇక్కడ ఉంది: 1. స్నాన సమయం & ప్రాముఖ్యత సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ | అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్ ॥ అర్థం: మాఘ మాసపు శుక్ల పక్ష సప్తమి (రథసప్తమి) సూర్యగ్రహణంతో సమానమైన పవిత్రమైనది. ఈ రోజున సూర్యోదయ సమయంలో (అరుణోదయం) చేసే స్నానం అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది. 2. ఆయురారోగ్యాలు మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా| కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః || అర్థం: మాఘ శుక్ల సప్తమి కోటి రెట్ల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యం వదలడం వల్ల ఆయుష్షు, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం సిద్ధిస్తాయి. 3. పాప విముక్తి ప్రార్థన యదా జన్మకృతం పాపం, మయా జన్మసు జన్మసు | తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ | | అర్థం: గత ఏడు జన్మలలో నేను చేసిన పాపాలను, వాటి వల్ల కలిగే రోగాలను మరియు దుఃఖాలను ఈ మాఘ సప్తమి స్నానం తొలగించు గాక. 4. మనో వాక్కాయ పాపాలు ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంత రార్జితమ్ | మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే ప...

రథ సప్తమి విశిష్టత చేయవలసిన విధులు

  🌺 రథ సప్తమి   ఈరోజు అనగా తేదీ 25 జనవరి 2026 రథసప్తమి. ఆదివారం మరియు మాఘ శుద్ధ సప్తమి రెండూ కలిసివచ్చిన శుభసమయం.  సాధారణంగా ఏ నెలలో అయినా సప్తమి ఆదివారం కలిసి వస్తే ఆ రోజును భాను సప్తమిగా పిలుస్తారు. అది కూడా మాఘమాసంలో, శుక్లపక్షంలో సప్తమి ఆదివారం కలిసి వస్తే అది చాలా విశిష్టమైన పర్వదినం. సూర్యభగవానుడు అదితి, కశ్యప మహర్షులకు జన్మించిన రోజుగా, సూర్యజయంతిగా రథసప్తమిని పరిగణిస్తారు. సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించే రోజు గా భావిస్తు చిక్కుడు కాయలతో రథాన్ని చేసి పూజిస్తారు భక్తులు. సూర్యుడిని ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈరోజు సూర్యోదయానికి ముందరే స్నానాదులు పూర్తిచేసి, ఆదిత్య హృదయం చదవడం, గాయత్రీ జపం చేయడం, రాగిపాత్రతో అర్ఘ్యం సమర్పించడం, ఆవు పిడకలపై పరమాన్నాన్ని వండి నైవేద్యం పెట్టడం మొదలైనవి చేయడం వలన ఆస్వామి అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు.  ఈ రోజు చేసే స్నానం, జపం మరియు దానం సూర్య గ్రహణ సమయంలో చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.  🌺 రథసప్తమి స్నాన విశిష్టత ...