🌸 గ్రహములు దీప్తాది అవస్థలు-తత్ఫలములు
శ్లో। దీప్తస్స్వస్థో ముదిత శ్శాన్త శ్శక్తో నిపీడితో భీతః ! వికలః ఖలశ్చ కథితో నవప్రకారో గ్రహోహరినా ॥ - సారావళీ దీప్తము, స్వస్థము, ముదితము, శాంతము, శక్తము, నిపీడితము, భీతము, వికలము, ఖలము అని రవ్యాది గ్రహములు తొమ్మిది విధములైన అవస్థలలో ఏదో ఒక అవస్థ పొందుచుందురు. శ్లో॥ స్వోచ్చే భవతిచ దీప్త స్స్వస్థస్స్వగృహే సుహృద్గృహే ముదితః | శాంతశ్శుభవర్గస్థ శ్శక్త స్స్ఫుటకిరణజాలశ్చ। శ్లో ॥ వికలో రవిలుప్తకరో గ్రహాభిభూతో నిపీడితశ్చైవం | పాపగణస్థశ్చఖలో నీచే భీత స్సమాఖ్యాతః ॥- సారావళీ ఉచ్ఛయందున్న గ్రహముదీప్తావస్థ, స్వక్షేత్ర మందున్నచో స్వస్థావస్థ, మిత్రక్షేత్ర మందున్న ముదిత, శుభవర్గ యందున్న గ్రహము శాంతావస్థ, సూర్యునకు దూరములో ఉన్నచో శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమందు పరాజయము పొందిన వాడు పీడితుడుగను, పాపగ్రహములచే వేధింపబడువాడును, పాపవర్గము లందున్నట్టివాడును, ఖలుడుగను, నీచపొందినవాడు భీతుడుగను చెప్పబడుదురు. 🌸 గ్రహ అవస్థా ఫలములు దీప్తావస్థ (ఉచ్చ) యందున్న గ్రహము యొక్క దశలో కీర్తియు, సకల సంపదలు కలుగును. స్వస్థావస్థ (స్వక్షేత్ర) యందున్న గ్రహముయొక్క దశాకాలములో ధనము,...