డోలన విద్య (Dowsing Pendulam)
డౌజింగ్ పెండ్యూలం డౌజింగ్ పెండ్యూలమ్ అనగా డోలన విద్య అంటారు.ఈ డోలనవిద్య అత్యంత అరుదైనది మరియు క్లిష్టమైనది. పెండ్యులాన్ని డోలకం అని కూడా అంటారు.డోలకాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చును.1)పెండ్యూలమ్ పైన దారంతో కట్టబడి ఉంటుంది.2)డోలకం మద్య భాగం చివర ఉండే కొన కంటే లావుగా ఉంటుంది.3)డోలకం చివర సన్నగా ఉంటుంది.డోలకాన్ని వెండి,ఇత్తడి,రాగి,కర్ర,స్పటికం,ఇంకా అనేక రకాల పధార్ధములతో తయారుచేస్తారు.అన్నిటికంటే మంచిది స్పటిక డోలకం Crystal Pendulam Pyramid Pendulam డోలనం దాని యొక్క ప్రక్రియ :- మానవుని షట్చక్రములలో మూడు చక్రములు మాత్రమే డోలన విద్యకు సంబందించినవి.అవి:- 1)ఆజ్ఞాచక్రము:- ఆజ్ఞాచక్రం మనస్సును నియంత్రించి తద్వారా యోచనలను మెదడునుండి ఆలోచనలను స్వీకరిస్తుంది. 2)విశుద్ధచక్రము :_శరీరభాగాన్ని ఉత్తేజపరిచి శక్తిని అధోభాగానికి పంపుతుంది. 3)అనాహత చక్రం :- ఈ చక్రం నుండి శక్తి ప్రధానంగా చేతులకు ప్రసారమవుతుంది. ఈ మూడు చక్రాలనుండి వచ్చిన శక్తిని చేటులోకి వచ్చిన పిమ్మట బొటన,చూపుడు వ్రేళ్ళకు అందించే విధంగా అభ్యాసము చేయవలెను.బ్రోటనవేలు అగ్నికి,చూపుడువేలు వాయువుకు సంబందించినది.మనస్సునందు ...